తెలంగాణ జిల్లాల వార్తలు (12.09.2012)
తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఎబీవీపి జైల్‌భరో విజయవంతం... 13న పునరంకిత దీక్షలకు జేఏసీ భాగస్వామ్య పక్షాలు సిద్ధం... షిండే వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు... సీమాంధ్ర సెటైర్... తెలంగాణ ఫైర్... కవాతుకు, మార్చ్‌కు కొనసాగుతున్న సన్నాహక సమావేశాలు... వేడెక్కుతున్న ఉద్యమం....
వివరాలు జిల్లాల వారిగా...
ఆదిలాబాద్
విమోచన దినం నిర్వహించాలని ఎబీవీపి జైల్‌భరో
ఆదిలాబాద్, దక్కన్‌న్యూస్: తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ అఖిల భారత విద్యార్ధి పరిషత్ (ఏబీవీపి) నాయకులు డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్‌లో జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వినాయక్ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై ఏబీవీపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జైతెలంగాణ నినాదాలతో మార్మోగించారు. పట్టణంలో వందలాది మంది విద్యార్థులు తరలిరాగా, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఏబీవీపికి చెందిన 24మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సర్వేష్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణలోని
10జిల్లాలను 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనం చేశారని, తెలంగాణాకు స్వాతంత్య్రం వచ్చిన ఈరోజును మిగితా రాష్ట్రాలలోని హైదరాబాద్‌కు చెందిన ప్రాంతాలలో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా, సీమాంధ్ర పాలనలో ఉన్న తెలంగాణలో మాత్రం నిర్వహించకుండా ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయికృష్ణ, శ్రీనివాస్, మనోజ్‌పవార్, నవీన్, రవికాంత్, అఖిల్, సాయికిరణ్, పూర్ణచందర్, ఆకాశ్, కపిల్, అభిలాష్, సజ్ఞ, సుమిత్, సునిల్, మోహన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్
మార్చ్‌కు విద్యార్థి సంఘాలు కలిసిరావాలి
హైదరాబాద్, దక్కన్‌న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసి నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌లో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. నిజాంకళాశాలలో మంగళవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థుల స్వాగత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భావి తరాలకోసమే తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా జరుగుతోందని, తెలంగాణ వస్తే రాజకీయ మనుగడ ఉండదనే భయంతోనే సీమాంధ్ర పెట్టుబడి దారులు ఉద్యమానికి అడ్డుతగులుతున్నారని అన్నారు. తెలంగాణ నాయకులు, ప్రజా ప్రతినిథులు ప్రలోభాలకు తలొగ్గి ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రూ.50లక్షలు, ఫార్చూనర్ కారు తీసుకుని నోరు కట్టేసకున్నారని ఆరోపించారు. కార్యమ్రంలో అడిషనల్ డిసిపి రాంచంద్రన్, ప్రిన్సిపాల్ అశోక్, అధ్యాపకులు పురుషోత్తం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి లాభాల బోనస్‌కోసం సీఎంకు వినతి
హైదరాబాద్, దక్కన్‌న్యూస్: సింగరేణి కార్మికులకు 25శాతం లాభాల బోనస్ ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని
కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యలు సీఎంను కలిసి సింగరేణి కార్మికులకు తక్షణం లాభాల వాటాను స్పెషల్ ఇన్‌సెంటివ్ రూపంలో ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా సకలజనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన అడ్వాన్సును మాఫీ చేయాలని, రికవరీ చేసిన రూ.75వేలను తిరిగి చెల్లించాలని, సింగరేణి కార్మికులకు ఇన్‌కమ్‌టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కొత్తగూడెం, రామగుండంలలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.
కరీంనగర్
కవాతుకు నేటి నుంచి బొట్టు పెట్టి ప్రచారం
కరీంనగర్, దక్కన్‌న్యూస్: తెలంగాణ మార్చ్ సన్నాహక సదస్సులో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలో చేపట్టనున్న కరీంనగర్ కవాతుకు మహిళా జేఏసి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ప్రచారం చేస్తారని తెలంగాణ రాజకీయ జేఏసి కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవాతుకు తరలిరావాలని జిల్లాలోని అన్నా వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ, విద్యార్ధి, వ్యాపార, వాణిజ్య, మహిళ, కులసంఘాలన్నింటికి కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. 16న నిర్వహించనున్న కార్యకర్తల సదస్సును వాయిదా వేస్తున్నామని, కవాతును ఎన్టీఆర్ చౌరస్తాలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వాలంటీర్లకు శిక్షణ ఇస్తామని, వీరితో పాటు అమరవీరుల కుటుంబాల సభ్యులు, సుల్తానాబాద్‌లో చేపడుతున్న దీక్షలో పాల్గొన్న వారు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, మంగళవారం కోరుట్ల, జగిత్యాలలో నిర్వహించామని, బుధవారం సిరిసిల్ల, వేములవాడల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో గవర్నర్ పర్యటనకు పెద్దఎత్తున నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. టీజేఏసి జిల్లా చైర్మన్ వెంకటమల్లయ్య, కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, మహిళా జేఏసి నాయకులు యశోద, రవీందర్‌లు పాల్గొన్నారు.
జగిత్యాలలో మంగళవారం నియోజకవర్గ స్థాయి జేఏసి సమావేశంలో పాల్గొన్న పిట్టల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక నుంచి ఈజిప్టు తరహాలో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. మార్చ్‌కు తెలంగాణ వాదులు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసి నాయకులు సీహెచ్‌వి ప్రభాకర్‌రావు, గిర నాగభూషణం, బీఎస్ రాములు, యాద రామకృష్ణ, నవీన్‌రెడ్డి, ఒడ్నాల రాజశేఖర్, మహేశ్, మదన్‌మోహన్, రాగిల్ల సత్యనారాయణ, శివశంకర్, కృష్ణ, ఎన్‌పీజే సైబెల్‌లు పాల్గొన్నారు.
మెట్‌పల్లిలో మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో జరిగిన సమావేశంలో జేఏసి కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ ఈనెల 16న కరీంనగర్‌లో తలపెట్టిన కవాతుతో యుద్ధభేరిని మోగిస్తామని అన్నారు. సమావేశానికి మండల జేఏసి కన్వినర్ సౌడాల కమలాకర్, నియోజకవర్గ కన్వినర్ తునికి రాఘవులు, మల్లాపూర్ మండల జేఏసి కన్వినర్ రమేశ్, రజక విద్యార్థి టీజేఏసి కార్యదర్శి మోరపాక శ్రీనివాస్, నాయకులు చాంద్‌పాషా, పుల్ల జగన్‌గౌడ్, జుంగుల మారుతిగౌడ్, ముదాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విమోచనాన్ని అధికారికంగా జరపాలి
కరీంనగర్, దక్కన్‌న్యూస్: ఈనెల 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తే ఏబీవీపి ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదుట ఉదయం 11.30గంటలకు నగర కార్యదర్శి ప్రవీణ్ నాయకత్వంలో 60మందకి పైగా విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. 17న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఏబీవీపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపి జోనల్ ఇంచార్జిలు పి.ప్రశాంత్, ఆర్.జగదీశ్, టి.అనిల్, బి.క్రాంతి, సాయికృష్ణ, అనిల్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ మధుకర్, వి.సృజన్, ఎన్.శంకర్, ఉపాద్యక్షుడు డి.శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలు, విద్యార్థులు, పాల్గొన్నారు.
కవాతును జయప్రదం చేయండి
కరీంనగర్, దక్కన్‌న్యూస్: ఈనెల 16న కరీంనగర్ కవాతు, 30న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం
చేయాలని కరీంనగర్ మండల జేఏసి విజ్ఞప్తి చేసింది. మంగళవారం మండల శాఖ కన్వినర్ బొగ్గుల మల్లేశం అధ్యక్షతన నగునూరు చౌరస్తాలో తెలంగాణ మార్చ్, కరీంనగర్ కవాతు పోస్టర్లను జేఏసి నాయకులు ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ ఈనెల 30లోపు తెలంగాణ వచ్చేది... కాంగ్రేస్ చచ్చేది తేలిపోవాలన్నారు. స్వార్ధరాజకీయాలకు, సీమాంధ్ర కుట్రలకు ఇక బలయ్యేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయంగా విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసవి మనోహర్, నాయకులు రవీందర్, కె.లక్ష్మణ్, ఎండీ బాబర్, శ్రీనివాస్, సీహెచ్.రాములు, బీ.కొంరయ్యలు పాల్గొన్నారు.
భగత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఈనెల 16న జరిగే కవాతుకు సంబింధించిన 'తెలంగాణ మార్చ్ - కరీంనగర్ టార్చ్' వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్బంగా టీజేఏసి నయోజకవర్డ ఇంచార్జిజ మర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ కవాతులో అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిఇంటికి ఒకరు, చేతిలో జెండాతో నగరంలో కవాతకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో 31వ డివిజన్ జేఏసి చైర్మన్ బొంతల ప్రవీణ్, కన్వినర్ రాజప్రభాకర్, తోట మధు, కో-చైర్మన్ ఆంజనేయులు, కోఆర్డినేటర్ కడర్ల విమల్, కన్నం శ్రీనివాస్, సందీప్, రాజు, జెట్టి కిరణ్, ప్రణయ్ శేఖర్ అరుణ, వెంకటేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు..
ఖమ్మం
పునరంకిత దీక్షలు జయప్రదం చేయండి
కూసుమంచి, దక్కన్‌న్యూస్: ప్రపంచ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకలజనుల సమ్మె ప్రారంభించి
ఈనెల 13తో సరిగ్గా ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో వందలాది మంది ఉద్యోగులతో పునరంకిత దీక్షను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి కోచైర్మన్, ఏపీటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిపి.నాగిరెడ్డి చెప్పారు. మంగళవారం కూసుమంచి మండలకేంద్రంలోని రెడ్డి హోటల్‌లో పునరంకిత దీక్షల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని అక్కడ దీక్షను చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 16న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉపాధ్యాయుల సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరెండు కార్యక్రమాల్లోనూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు ప్రసాద్, భాస్కర్, శంకర్, నర్సింహరావు, రాంకోటి, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గరికెపాటి 49వ వర్ధంతి వేడుకలు
పాల్వంచ, దక్కన్‌న్యూస్: ప్రజల సమస్యలపై గజ్జెకట్టి గళమెత్తి పోరాటం చేసిన మహయోధుడు గరికెపాటి రాజేశ్వరరావు అని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ముద్దా భిక్షం అన్నారు. పాల్వంచలో మంగళవారం సాయంత్రం ప్రజా కళాకారుడు రాజేశ్వరరావు 49వ వర్ధంతి సభలో మాట్లాడారు. తన ఆటాపాటలతో పల్లె ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప కళాకారుడని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్తయ్య, టీజేఏసి కన్వినర్ కూసపాటి సాయికృష్ణ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు చండ్రా నర్సింహరావు, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు, రాంబాబు, ముత్యాలరావు, కల్లూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్
కాంగ్రేస్ నాటకం బయటపడింది
మహబూబ్‌నగర్, దక్కన్‌న్యూస్: మాజీ హోంమంత్రి చిదంబరం 2009లో నిండు పార్లమెంట్‌లో తెలంగాణ
ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటిస్తే.. అదే సీట్లో కూర్చున్న ప్రస్తుత హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మాత్రం తెలంగాణ విషయం తనకు తెలియదని ప్రకటించడంతో.. తెలంగాణపై కాంగ్రేస్ నాటకం బయటపడిందని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రేస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని టీకాంగ్రేస్ నాయకులు, ఇచ్చే అవకాశం లేదని సీమాంధ్ర కాంగ్రేస్ నాయకులు ప్రకటిస్తూ... ప్రజల్లో గందరగోళం రేపుతున్నారన్నారు. గతంలో ఇక్కడ గవర్నర్ పదవిలో పనిచేసి షిండేకు ఇక్కడి పరిస్థితులు తెలియవంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ మార్చ్ ఉద్యమం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణ అంతటా జరపడానికి స్థానిక నాయకులు, ప్రజలు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వి.వెంకటేశ్వర్లు, బిచ్చారెడ్డి, నాగభూషణ్, జక్కగోపాల్, పర్మటిచిన్నా, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ
సంగారెడ్డి, దక్కన్‌న్యూస్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా ఉన్న ఈ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఈనెత 13న హైదరాబాద్‌లో నూతనంగా ఆవిర్భవించినుంది. సంఘం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యూనియన్ నాయకులు షబ్బీర్ అహ్మద్, సాయిరెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మినారాయణ, మురళీధర్‌రెడ్డి, కృష్ణమోహన్, కుమారస్వామి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
సకల జనుల సమ్మె స్ఫూర్తి సభ
సిద్దిపేట, దక్కన్‌న్యూస్: రాష్ట్ర ఏర్పాటు కోసం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె నేటితో సంవత్సరం అవుతున్న సందర్భంగా బుధవారం సిద్ధిపేటలో సకల జనుల సమ్మె స్ఫూర్తి సభను శివమ్స్ గార్డెన్‌లో మధ్యాహ్నం 1గంటకు నిర్వహిస్తున్నట్లు టీఎన్జివోస్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ తెలిపారు. ఈ స్ఫూర్తి సభకు తెలంగాణ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్, నూతన అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నందిని సిద్దారెడ్డి, రసమయి బాలకిషన్, తూర్పు జిల్లా జేఏసి కన్వినర్ డాక్టర్ పాపయ్యగౌడ్‌లు ఈ సభకు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో టీఎన్జీవోస్ నేత శ్రీహరి, జి.పరమేశ్వర్, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి అశ్వక్‌అహ్మద్, ఉపాధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మజీదు, వర్మ, ధర్మసాగర్, నర్సింలు, రఘుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ
తెలంగాణ సాహిత్యం లేనిదే.. తెలుగు సాహిత్యం లేదు
మిర్యాలగూడ, దక్కన్‌న్యూస్: ప్రజల జీవితం, వారు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, కరువు కథా వస్తువులుగా
వచ్చిన సాహిత్యమే తెలంగాణ సాహిత్యమని, తెలంగాణ సాహిత్యం లేకుండా తెలుగు సాహిత్యం లేదని ప్రముఖ కవి, మంజీర రచయితల వేదిక వ్యవస్థాపకులు నందిని సిధ్ధారెడ్డి, సుంకరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన 'కవిదృశ్యం' సీడీ ఆవిష్కరణ సభలో వారు మాట్లాడుతూ... కోస్తా ప్రాంతంలో కవులు సాహిత్య సృజనకు కథావస్తువులు లేవు, అక్కడ ప్రజల జీవనంలో సంక్లిష్టత లేదు. కరువు కాటకాలు అంతకన్నాలేవని అక్కడి కవులే అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. పాటసాహిత్య ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లో వచన కవిత్వంపై ఆదరణపెంచాలనే ఉద్దేశంలో దేశపతి శ్రీనివాస్, దూసరి బాలాజీల ప్రయోగం వినూత్నమైందన్నారు. 1997కు పూర్వం పాలకుల తెలంగాణ పదం ఎత్తితే తీవ్రవాదులుగా పరిగణించారని, ప్రస్తుతం పరిస్థితి మారిందని, సీమాంధ్ర పార్టీలు, మీడియా తెలంగాణ పేరెత్తకుండా ఒక్కఅడుగు ముందుకు వేయలేని పరిస్థితి నేడుందన్నారు. ఈ ప్రాంత కవులు, కచయితలు ఇక్కడి పరిస్థితులను ఆకలింపుచేసుకొని ఆసమస్యలకే అక్షరరూపం ఇస్తారన్నారు. కవులు తాము రాసిన కవితలను వారి గంభీర కంఠంతో వినిపించే అవకాశాన్ని దానికి దృశ్యరూపం కలిగించిన ఈ ప్రయోగం తరతరాలు నిలిచిపోతుందన్నారు. దీంతో కొందరిలో కవిత్వం రాయాలనే తపన కలుగే అవకాశం ఉందన్నారు. అల్లం నారాయణ, నందిని, వరవరరావు వంటి ప్రముఖులు కవిత్వ పఠనం చేసే దృశ్యాలను ముందు తరాలకు అందించే అవకాశముందన్నారు. నేడు తెలంగాణ ఉద్యమానికి పాటే ప్రధాన ఆయుధంగా ముందుకు నడిపిస్తోందన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సుబ్బారావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి నాగయ్య, బాబన్న, తెలంగాణవాదులు కె.శ్రీకాంత్‌బాబు, తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, ఫొటోగ్రాఫర్ దూసరి బాలాజీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె.ప్రభాకర్, జ్వాలా వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, స్ఫూర్తి వెంకన్న, గణేష్, జాగృతి నాయకులు దేవేందర్, టీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి
నిజామాబాద్
989వ రోజుకు చేరిన తెలంగాణ దీక్షలు
బోధన్, దక్కన్‌న్యూస్: స్థానిక అంబెద్కర్ చౌరస్తాలో జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాధన దీక్షలు మంగళవారానికి 989వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో తెలంగాణ వాదులు ఎ.శ్రావణ్, జి.జనార్థన్, ఎండీ.నవాజ్, ఇస్మాయిల్‌ఖాన్, డి.చిన్నయ్యలు కూర్చున్నారు. ఈదీక్షా శిబిరాన్ని జేఏసి ప్రధాన కార్యదర్శి బి.మల్లేష్, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాస్, కార్యదర్శి ఆర్.గౌతంకుమార్, కుల సంఘాల జేఏసి కన్వినర్ ఎ.సుదర్శన్‌గౌడ్, జేఏసి సభ్యులు చిన్నోల్ల ముత్తెన్న, సుభాశ్, టీజీవిపి నాయకులు పంపరి నవీన్‌కుమార్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
'విమోచన' నిర్వహణకు 'జైల్‌భరో'
నిజామాబాద్, దక్కన్‌న్యూస్: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా
నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపి ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఏబీవీపి నాయకులు మొదట నగరంలోని బస్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్ అంతరాయం కలుగటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనాకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి, సొంతపూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏబీవిపి కార్యదర్శి శంకర్, కన్వినర్ అంజాగౌడ్, అనిల్, వాసు, ముఖేశ్, లాల్‌సింగ్, శ్రావణ్, రాకేశ్, ఇతర కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఏబీవీపి ఆధ్వర్యంలో ఐదువేల మందితో భారీ ర్యాలీని నిర్వహించి, స్థానిక నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు 50మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈఆందోళనలో తెలంగాణ యూనివర్సిటీ కన్వినర్ ముత్యం నారాయణ, ఏబీవీపి భాగ్‌కన్వినర్ మన్నె కృష్ణ, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, ప్రసాద్‌గౌడ్, నరేష్, ప్రతినిధులు సాయిబాబా, రంజిత్, వెంకట్, అశోక్, రమేష్, వినోద్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేటకు చేరిన విద్యార్థి పాదయాత్ర
నందిపేట, దక్కన్‌న్యూస్: విద్యార్థి మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి జేఏసి చేపట్టిన
పాదయాత్ర మంగళవారం నందిపేట మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్బంగా విద్యార్థి జేఏసి నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరును ప్రజాప్రతినిధులే పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా విద్యార్థులే తెలంగాణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నియో లిటిల్‌ఫ్లవర్ స్కూల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రిలే దీక్షా శిబిరం వరకు సాగింది. మార్గమద్యంలో అంబెద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యార్థి జేఏసి కన్వినర్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు దిలీప్, యండెల ప్రదీప్, ప్రవీణ్‌గౌడ్, చంద్రకాంత్‌గౌడ్, వినయ్‌కుమార్, చంద్రకాంత్ గుప్తా, శ్రీకాంత్, సాగర్, రవి, కిరణ్, నాగసురేష్, మాచర్ల సాగర్, శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి
మార్చ్‌కు ముందే ప్రకటన చేయాలి
వికారాబాద్, దక్కన్‌న్యూస్: తెలంగాణ మార్చ్‌కు ముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మిషన్‌గ్రౌండ్‌లో జరిగిన పోరు బతుకమ్మ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణతో ఆమెపై నమోదైన కేసు విషయంలో వికారాబాద్‌లో జిల్లా అదనపు కోర్టుకు ఆమె హాజరయ్యారు. అనంతరం వికారాబాద్ పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అనంతరం స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనరులతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరిందని చెప్పడం కాదని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రేస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లడం మాని తెలంగాణపై స్ఫష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ది ఉంటే ఈనెల 17నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. జైతెలంగాణ అన్నందకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కోల్పోయిన చంద్రకాంత్‌రెడ్డికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా విద్యార్థి జేఏసి నాయకులు శుభప్రద్‌పటేల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణదాస్, మల్లన్న, బాలమ్మలు పాల్గొన్నారు.
ఇబ్రహీం పట్నంలో జైల్‌భరో ఉద్రిక్తం
ఇబ్రహీంపట్నం, దక్కన్‌న్యూస్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని, ఈనెల 17న తెలంగాణ
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపి నాయకులు శివకుమార్, దిలీప్, మహేశ్, శాంతికుమార్, రమేష్, శివలింగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున సాగర్ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులకు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల పట్ల సిఐ అసభ్యపదజాలంతో దూషించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రహదారిపై మళ్లీ బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఏసీపి సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని విద్యార్థులను శాంతింపజేశారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం నాయకులు కొప్పు బాష, బీజేపి నాయకులు బూడిద రాంరెడ్డి, బాసయ్య, బండి మహేశ్, టేకుల రాంరెడ్డి, శ్రీశైలం, జంగయ్యగౌడ్, పురుషోత్తం, విజయ్‌లు స్టేషన్‌కు చేరుకుని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో ఎజీవీపి నాయకులు లింగం, మహేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, విక్రం, అనిల్‌రెడ్డి, కృష్ణ, జలదీప్‌రెడ్డి, సైదులు, శ్రీధర్, ప్రవీణ్‌రెడ్డి, పరమేష్, దీక్షిత్‌లు పాల్గొన్నారు.
వరంగల్
కేంద్రమంత్రి షిండే దిష్టిబొమ్మ దహనం
వరంగల్, దక్కన్‌న్యూస్: తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని టీఆర్‌ఎస్వీ నాయకులు హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణ విషయం తనకు తెలియదని ప్రకటించడంపై తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగురోడ్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం ఆలస్యం చేయడం వల్లే యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారన్నారు. సెప్టెంబర్ 30లోగా తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూత్‌నాయకులు రమేష్, తిరుపతి, నరేశ్, సుమన్, మనోజ్, రంజిత్, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
23న లంబాడీ విద్యార్థి గర్జన
ఏటూరునాగారం, దక్కన్‌న్యూస్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని కోరుతూ
ఈనెల 23న జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్కులో నిర్వహించతలపెట్టిన లంబాడీ విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలని తెలంగాణ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు కిషన్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం విద్యార్థి గర్జన వాల్‌పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు లంబాడీలు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ వ్యతిరేక ప్రకటనలు మానుకోకపోతే వారికి తగిన బుద్దిఇ చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రవీణ్‌నాయక్, బానోతు జవహర్‌నాయక్, భూక్యాశ్రావణ్‌కుమార్, కావత్ ప్రతాప్ నాయక్, పోరిక దరమ్‌సింగ్, బూక్యా నర్సింహ, పోరిక గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

