మార్చ్‌లో సకుటుంబ సమేతంగా పాల్గొంటాం
హైదరాబాద్, దక్కన్‌న్యూస్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసి చేపట్టిన తెలంగాణ మార్చ్‌లో కుటుంబ సమేతంగా పాల్గొంటామని, ప్రభుత్వం ఏమైనా ఆటంకాలు కల్గిస్తే మరుసటి రోజునుంచే నిరవదిక సమ్మెకు పూనుకుంటామని తెలంగాణ ఉద్యోగుల జేఏసి ప్రకటించింది. టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగుల జేఏసి విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది.
జేఏసి నేతలు దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి, వెంకటేశం, వై.శ్రీనివాసరావు, వెంకటస్వామి, అనంత రాములు, శివాజీ, జ్ఞానేశ్వర్, వెంకటపతిరాజు, కృష్ణాయాదవ్, మమత, రేచల్, రంజన, 121 సంఘాల ప్రతినిధులు, 10జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
సకలజనుల సమ్మె జరిగి ఏడాది కాలం పూర్తికానున్న సందర్భంగా ఈనెల 13న పునరంకిత దీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర సాధనకు అంతిమ పోరాటంగా తీసుకుంటామని, గ్రామ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు మార్చ్‌లో సకుటుంబ సమేతంగా పాల్గొంటారని అన్నారు. ఈ విషయంలో పోలీసులు కాని, ప్రభుత్వం కాని అడ్దంకులు సృష్టిస్తే మళ్లీ సకల జనుల సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసికి నూతన చైర్మన్‌గా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
<< Back to Archives
