ధోని తప్పు చేశాడు

.

 

చెన్నై, దక్కన్‌ న్యూస్‌ : భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తప్పు చేశాడంట.

 

 

frankling-dhoni-wrong-big-golkondadaily.comఈ మాటలు ఎవరో కాదు అన్నది న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ ఫ్ల్రాంక్లిన్‌ పేర్కొన్నాడు. ఇలాంటి తప్పు చేయడం ఆశ్చరకరమైందని తెలిపాడు. చెన్నైలో టీ-20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ధోని మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇదే తమకు ఆశ్చర్యం కలిగించిందని చెబుతున్నాడు. మందకొడి పిచ్‌ మీద తొలుత బౌలింగ్‌ చేయాలనే నిర్ణయం సరైంది కాదని ఆయన అన్నారు. విరాట్‌ కోహ్లి అవుటైన తరువాత కొత్త బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకుండా ఉండాలని అనుకున్నామని,

 

తెలివిగా బౌలింగ్‌ చేయడం వల్ల సాధ్యమైందని తెలిపాడు. శ్రీలంకలో సెప్టెంబర్‌ 16వ తేదీ నుండి జరిగే ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో భారత్‌పై విజయం సాధించడం సంతోషంగా ఉందని జేమ్స్‌ ఫ్ల్రాంక్లిన్‌ తెలిపాడు. టెస్టులో మాత్రం చాలా దారుణంగా ఆడామని, ఈ విజయం మాత్రం సంతోసం కలిగించిందేనని, తాము బాగ ఆడటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.

 

<< Back to Archives