తెలంగాణ మార్చ్‌ టీ-ఎంపీల పరుగో..పరుగు..

.

 

హైదరాబాద్‌, దక్కన్‌ న్యూస్‌ : తెలంగాణ మార్చ్‌..తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల పరుగు...ఎక్కడికి..ఎందుకు అంటారా ? ఇది చదవండి..

 

 

chalo-hyderabad-telangana-march-t-cong-delhi-golkondadaily.comసెప్టెంబర్‌ 30 ఏం జరుగుతోంది..ఎక్కడ చూసిన అదే చర్చ...'తెలంగాణ మార్చ్‌' ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి 'తెలంగాణ మార్చ్‌' చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల విషయానికొస్తే వారికి పదవులు కావాలంట..కాని ఉద్యమంలో భాగస్వాములు కారు. అధిష్టానం ఒప్పిస్తున్నాం అంటారు ..కాని ఎటూ తేల్చరు. ఇలా వారు కాలం గడుపుతున్నరు. కాని ఇక వారికి నూకలు చెల్లినట్లే. ఎందుకంటే వారి ఎదుట 'తెలంగాణ మార్చ్‌' ఓ సమస్యగా కూర్చొంది. కొంతమంది నేతలు మాత్రం 'తెలంగాణ మార్చ్‌'కు సపోర్ట్‌ ఇస్తున్నారు. ఇక ఎటూ మాట్లాడని నేతలు ఎలాగైనా దీనిని నుండి రక్షించాలంటూ ఏకంగా అధిష్టానానికి వేడుకోలు చేస్తున్నారంట. అందుకొరకు ఢిల్లీకి పయనమౌతున్నరని వార్తలు వస్తున్నాయి.

 

బుధవారం మంత్రి జానారెడ్డి, మరో మంత్రి బస్వరాజు సారయ్యలు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటి అయ్యారు. వీరి భేటిలో ప్రధానంగా తెలంగాణ మార్చ్‌ గురించే చర్చించినట్లు కథనాలు వెలువుడుతున్నయి. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తులను మార్చ్‌లో టార్గెట్‌ చేయాలని ఓ నేత పేర్కొనడం తెలిసిందే. దీనితో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగతా నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. మంత్రులుగా ఉంటూ తెలంగాణ మార్చ్‌కు మద్దతివ్వాలా ? లేదా ? అనే విషయంపై తర్జనలు భర్జనలు పడుతున్నరు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధి అపాయిట్‌మెంట్‌ కూడా కోరినారంట. ఇంకా 'అమ్మ' అనుగ్రహం రాలేదని తెలిసింది. తెలంగాణ మార్చ్‌ దెబ్బకు టీ-కాంగ్రెస్‌ ఎంపీ ఛలో ఢిల్లీ అంటున్నారు..

 

<< Back to Archives