జైలు నుండి విడుదలైన కార్టునిస్టు అసీంత్రివేది

.

కార్టునిస్టు అసీం త్రివేది జైలు నుండి విడుదలయ్యారు. దేశద్రోహం, భారతదేశాన్ని అవమానించారని వివిధ సెక్షన్‌లను ఆయనపై నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

 

assem-trivedi-bail-golkondadaily.comశనివారం నాడు అరెస్టుయైన అసీం త్రివేది బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం నాడు త్రివేదిని కోర్టులో హాజరుపర్చగా సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం ఐదు వేల పూచికత్తుతో ఆయనకు ముంబాయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కార్టునిస్టు అరెస్టు చేయడం పట్ల అన్నా హాజరే బృందంలోని సభ్యుడు అరవింద్‌ క్రేజీవాల్‌తో పాటు పలువురు ఖండించారు.

 

బేషరతుగా విడుదల చేయాలని, దేశద్రోహం వంటి కేసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల అన్నా హాజారే దీక్ష సందర్భంగా జరిగిన ర్యాలీలో అసీం త్రివేది కార్టునిస్టులను ప్రదర్శించారు. అందులో భారతదేశాన్ని అవమానించారని కేసులను నమోదు చేశారు. అవినీతిపై వేసిన ఆయన కార్టున్‌లపై ప్రభుత్వం కేసులను నమోదు చేసింది.

<< Back to Archives