200 కు చేరిన మృతుల సంఖ్య
కరాచి, దక్కన్ న్యూస్ : పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ బట్టల దుకాణానికి చెందిన ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 200కి చేరింది.
మంగళవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. మృతుల సంఖ్య ఇంకా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కరాచీలోని హబ్‌రివర్ రోడ్డులోని బట్టల దుకాణ ఫ్యాక్టరీలో మంటలు చేలరేగాయి. ప్రమాద సమయంలో కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉన్నారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు తలో దిక్కుకు పారిపోయారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునే తొందరలో కిటీకిల నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.
కొందరు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుని పోవడంతో మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు ఇతర ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. సుమారు 50 మంది క్షతగాత్రులను కరాచీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లాహోర్‌లోని ఓ షూ ఫ్యాక్టరీలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో 25 మంది కార్మికులు మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
<< Back to Archives

