బాబు యాత్ర పేరు 'ప్రజాపోరు యాత్ర'

.

 

హైదరాబాద్‌, దక్కన్‌ న్యూస్‌ : టీడీపీ అధ్యక్షులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటన్న యాత్రకు పేరు పెట్టారు.

 

 

chandra-babu-delhi-big-golkondadaily.com'ప్రజాపోరు యాత్ర' అని నామకరణం చేశారు. ఈ రోజు ఉదయం యనమల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాబు యాత్రకు సంబంధించిన అంశాలపై ఈ కమిటీ చర్చించింది. చివరకు 'ప్రజాపోరు యాత్ర' పేరును ఖరారు చేశారు. అక్టోబర్‌ 2వ తేదీ నుండి యాత్ర ప్రారంభం అవుతుంది. 117 రోజుల పాటు బాబు పాదయాత్ర చేయనున్నారు. కానీ ఈ పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభిస్తారో తెలియడం లేదు.

 

ఇప్పటికే ఈ అంశంపై బాబు సీనియర్‌ నేతలతో ముచ్చటించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుండి ప్రారంభించాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు బాబును కోరిన విషయం తెలిసిందే. దీనిపై బాబు ఎలాంటి హామీనివ్వలేదు. బాబు పాదయాత్ర చేస్తారా ? లేక సైకిల్‌ యాత్ర చేపడుతారే అనే సందిగ్ధం ఉండేది. బాబు పాదయాత్ర చేసే ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం.

 

<< Back to Archives