హైదరాబాద్‌, దక్కన్‌ న్యూస్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య ఒక్కసారిగా భేదాభిప్రాయాలు బయటకు వచ్చాయి.

 

ఆంధ్రప్రదేశ్‌ను ''మూడు'' రాష్ట్రాలుగా విభజించాలి


అభినందన సభపై


అనుమానాల తెర!


తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘం (టిఎన్టీవోల సంఘం) పూర్వ అధ్యక్షుడు కనకమామిడి స్వామిగౌడ్‌ ఉద్యోగ, పదవీ విరమణ మరియు నూతనంగా కేంద్రసంఘానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన జి.దేవీ ప్రసాదరావు, కారం రవీందర్‌ రెడ్డిలకు అభినందలు తెలిపే సందర్భంగా ఆ సంఘం కేంద్ర కమిటీ శనివారం నాడు రవీంధ్రభారతి ఆడిటోరియమ్‌లో పెద్దయెత్తున నిర్వహించిన అభినందన సభావేదిక మీద తెలంగాణ జేయేసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ యం. కోదండరామ్‌ కనిపించకపోవడం ఉద్యమవర్గాలను ఆశ్చర్యపరిచింది.

 

టిఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిధిగా హాజరైన ఈ సభకు నిర్వాహకులు జేయేసీ చైర్మెన్‌ కోదండరామ్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే ఆహ్వానించలేదని అత్యంత విశ్వాసనీయంగా తెలిసింది.తెలంగాణ ఎన్జీవోస్‌ కేంద్ర సంఘం ముద్రించిన ఆహ్వానంలోనూ కోదండరామ్‌ పేరు లేకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరైన ఈ అభినందన సభలో కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నగారా అధ్యక్షుడు నాగం జనార్థన్‌ రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు కె. కేశవరావు, చుక్కా రామయ్య, ఈటెల రాజేందర్‌, సిపిఐ శాసనసభాపక్షనేత గుండా మల్లేష్‌, సీనియర్‌ జర్నలిస్టులు అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, తెరవే అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు హాజరయ్యారు.

 

తెలంగాణ ఉద్యమంలో అగ్రనాయకులుగా పనిచేస్తున్న ఈ ఇద్దరి మధ్యన మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల తర్వాత నుండి తీవ్రస్థాయి మనస్పర్థలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేయేసీ చైర్మెన్‌గా కోదండరామ్‌ స్థానంలో స్వామిగౌడ్‌ను నియిమించేందుకు కె.సి.ఆర్‌ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ విషయంలో మీడియాలో వరుసగా వస్తున్న కథనాలను కెసిఆర్‌గానీ, టిఆర్‌ఎస్‌పార్టీగానీ, స్వామిగౌడ్‌గానీ ఇంతవరకూ ఖండించకపోవడాన్ని జేయేసీ వర్గాలు గతంలో జరిగిన స్టీరింగ్‌ కమిటీ సమావేశాల్లో తప్పుపట్టాయి. మే 16వతేదీనాడు లోటస్‌పాండ్‌లో జేయేసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, జేయేసీ కొత్త చైర్మెన్‌గా స్వామిగౌడ్‌ పేరును ప్రకటించేందుకు కె.సి.ఆర్‌ సిద్ధపడినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

 

ఈ మేరకు కె.సి.ఆర్‌. స్వయంగా కొంతమంది జిల్లా జేయేసీ చైర్మెన్‌లతో కూడా స్వయంగా సంప్రదించారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మే 15వ తేదీన తెలంగాణ జేయేసీ అత్యవసర విస్తృతస్థాయి సమావేశాన్ని సిటీకాలేజీలో నిర్వహించి కోదండరామ్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవంగా తీర్మాణం చేయడం ద్వారా కెసిఆర్‌ ప్రయత్నాలకు 'చెక్‌' పెట్టినట్లు జేయేసీ వర్గాలద్వారా తెలిసింది. నాయకత్వ మార్పు విషయంలో కెసిఆర్‌ ఎత్తులకు, జేయేసీ నాయకులు పైఎత్తులు వేసి చిత్తు చేయడంతో జేయేసీపై టిఆర్‌ఎస్‌ అధినేత మరింత కసిని పెంచుకున్నట్లు చెబ్తుతున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కెసిఆర్‌ సుధీర్గ మంతనాలు జరపడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తెలంగాణ జేయేసీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను కొనసాగించాలని ఇదే సందర్భంలో జేయేసీ నిర్ణయించుకోవడం, తర్వాత జరిగిన మూడు సమావేశాలకు రాజకీయ పార్టీలను (బి.జె.పి., టిఆర్‌ఎస్‌) ఆహ్వానించకపోవడం ఈ పరిణామాలను ధృవీకరిస్తున్నది.

 

తెలంగాణ జేయేసీలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఎన్జీవోస్‌ నిర్వహించిన సమావేశానికి జేయేసీ చైర్మెన్‌ కోదండరామ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా ఆహ్వానించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాకుడా ఈసభలో ప్రసంగించిన వక్తలెవ్వరూ కనీసం కోదండరామ్‌ పేరును ప్రస్తావించకపోవడం, స్వామిగౌడ్‌ను టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని, తెలంగాణ రాష్ట్రంలో స్వామిగౌడ్‌ను క్యాబినెట్‌ మంత్రిగా చేస్తామని కెసిఆర్‌ ప్రకటించడంకూడా జేయేసీలో తాజా పరిణామాలకు పరాకాష్టగా భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాలతో సంబంధం లేకుండా, తెలంగాణ జేయేసీ మాత్రం 'తెలంగాణ మార్చ్‌-ఛలో హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా జేయేసీలను సమాయాత్తం చేసే పనిలో నిమగ్నమయ్యింది.

 

హైదరాబాద్‌, దక్కన్‌న్యూస్‌ : మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికలో 'తెలంగాణ అంశం' లేకపోతే ఆ నివేదిక అసంపూర్ణమే అవుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

 


దక్కన్‌ న్యూస్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో జోరుగా వర్షం కురుస్తోంది. ఉద్యోగులందరు తమ తమ కార్యాలయాల్లో పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలోనే వర్షం జోరుఅందుకోవడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. నగరంలోని అనేక ప్రాంతాలలో రోడ్లన్ని వాన నీటితో నిండిపోయాయి. కాలువలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

దీంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని అనేక ప్రాంతాలలో బోనాల జాతర పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాత్రి 8 గంటల వరకు వర్షం జోరు తగ్గలేదు. అయితే చాలా రోజుల తర్వాత నగరంలో ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం నగర ప్రలజకు ఊరట కలిగించింది.

 

ఢిల్లి, దక్కన్‌ న్యూస్‌ : రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది.