వాక్సింగ్ చేసుకుంటున్నారా ?
మహిళలలో కొందరికి అవాంఛిత రోమాలు బాధ పెడుతుంటాయి. ఏవేవో కెమికల్స్ వాడడం వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా చర్మం దెబ్బతింటుంది. ఎలా మరి...
సెనగపిండి, పెరుగు, పసుపు ఈ మూడు చాలు అవాంఛిత రోమాలు పెరగవని బ్యూటిషియన్లు అంటున్నారు. ఈ మూడింటిని పేస్టులా తయారు చేసుకుని ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు రాసుకోవాలి. ముఖంపై ఉన్నాయనుకోండి దీనికి బ్యూటిఫారర్లకు వెళ్లకుండా ఒక 30 గ్రాముల చక్కెర తీసుకుని అందులో పది.మిల్లిలీటర్ల నిమ్మకాయ జ్యూస్‌ను కలపండి దీనిని ముఖానికి రాసుకుని ఓ 15 నిమిషాల తరువాత చల్లని నీటితే కడిగేయాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తగ్గిపోతాయని బ్యూటిషన్లు అంటున్నారు. మరొక విధంగా పది మి.లీ నిమ్మరసం, 40 మి.లీటర్ల తేనేను కలిపి కాటన్‌తో వెంటుకలున్న ప్రాంతంలో రాయాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలకు గుడ్‌బై చెప్పవచ్చు...
<< Back to Archives

