'గోల్‌మాల్-3'లో వెంకటేష్ ?
'గోల్‌మాల్-3' సినిమా రీమెక్ చేయబోతున్నారా ?
ప్రస్తుతం టాలీవుడ్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. మరి ఇందులో కథనాయకుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా ? విక్టరి వెంకటేష్ అంట. టాలీవుడ్‌లో దీనిపై కథనాలు వస్తున్నాయి. కామెడీ అంశంతో కూడుకున్న ఈ చిత్రంలో 'వెంకటేష్' కరెక్టు సరిపోతాడని అనుకుంటున్నారంట. 'గోల్‌మాల్-3' సినిమా బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్‌లో నిర్మిస్తే బాగుంటుందని, ఇందులో 'వెంకటేష్' నటిస్తే తెలుగులో హిట్ సాధిస్తుందని కొందరు దర్శక, నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
కామెడీ పాత్రలంటే వెంకటేష్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. కొన్ని సినిమాలలో వెంకటేష్ పండించిన హాస్యానికి థియేటర్లలలో నవ్వుల వర్షం కురుస్తుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన విషయం వెంకటేష్ దగ్గరకు వెళ్ళలేదని టాక్. ప్రస్తుతం ఆయన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో బిజీగా ఉండమమే కాకుండా 'షాడో' సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీతో కూడుకున్న పాత్రలంటే 'వెంకటేష్' మక్కువ చూపుతున్నట్లు తెలిసింది.
<< Back to Archives

