'నన్ను మోసం చేశాడు'

.

తనను ఓ హీరో మోసం చేశాడని...మళ్ళీ ఇలా జరుగకుండా జాగ్రత్త పడుతానని అంటోంది గోవా బ్యూటి 'ఇలియాన'.

 

 

ileana-suspended-tollywood-golkondadaily.com అసలు ఇలియాను ఏం మోసం చేశాడు అనే కదా మీ అనుమానం..ఓ తెలుగు సినిమా చేస్తున్న సమయంలో ఓ హీరోని 'ఇలియాన' ప్రేమించిందంట. అయితే ఆ హీరో మాత్రం తనను నిలువునా ముంచేశాడని 'ఇలియాన' వాపోయింది. ఇటీవల బాలీవుడ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి ప్రేమలో పడలేదని చెబుతోంది.

 

మరి మీకు ఎలాంటి వ్యక్తి కావాలంటే తన మగడు నిజాయితీగా ఉండాలని మాత్రం ఇలియాన చెబుతోంది. ప్రేమించిన 'హీరో' ఎవరంటే మాత్రం జవాబు చెప్పడం లేదు. ఇప్పుడా 'హీరో' ఎవరని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ హీరోతో నటించినప్పుడే వీరిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని ఈ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరూ గొడవ పడి మాట్లాడడం మానేశారని కూడా పుకార్లు వ్యాపించాయి. ఆ హీరో..ఇలియాన చెప్పే హీరో ఒకడేనా లేక ఇంకెవరైనా ?

<< Back to Archives