బాలీవుడ్‌లో ప్రిన్స్‌ ?

.

టాలీవుడ్‌ అందగాడు ప్రిన్స్‌ 'మహేష్‌బాబు' త్వరలో 'బాలీవుడ్‌'లో అడుగుపెట్టబోతున్నాడా ?

 

 

mahesh-bollywood-shankar-golkondadaily.comదీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. కాని మహేష్‌ బాబు సన్నిహితులు మాత్రం అలాంటిదేమి లేదన చెబుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా టాలీవుడ్‌లోనే మహేష్‌ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకులు 'శంకర్‌' ఓ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారంట. ఆయన ప్రస్తుతం 'విక్రమ్‌'తో తీస్తున్న చిత్రం అయిపోగానే బాలీవుడ్‌లో సినిమా తీయాలని అనుకుంటున్నారంట.

 

దీనితో ఏ హీరోతో తీయాలని అనుకుని 'హృతిక్‌ రోషన్‌' అయితే కరెక్టు శంకర్‌ అనుకున్నాడని బాలీవుడ్‌ టాక్‌. అయితే డేట్స్‌ విషయంలో హృతిక్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. దీనితో శంకర్‌ దృష్టి టాలీవుడ్‌లో సంచనాల విజయాలతో దూసుకెళ్తున్న ప్రిన్స్‌ మహేష్‌బాబుపై పడింది. కానీ ఇవన్ని పుకార్లే అని మహేష్‌ బాబు సన్నిహితులు పేర్కొంటున్నారు. మహేష్‌ నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా షూటింగ్‌ తరువాత దీనిపై ఓ క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

 

<< Back to Archives