138 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

.

ముంబాయి, దక్కన్‌ న్యూస్‌ : బుధవారం స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

 

 

today-market-small golkondadaily.comసాయంత్రం సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ కూడా 38 పాయింట్ల లాభంలో కొనసాగుతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభాలలో ట్రేడవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కూడా లాభాలను చవి చూస్తున్నాయి. యూరోజోన్‌ రక్షిత నిధికి జర్మని ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది..లేదా అనే దానిపై జర్మన్‌ కోర్టు తీర్పునివ్వనుంది. దీనితో పాటు ఫెడరల్‌ రిజర్వ్‌ మూడో విడత స్లిమ్యులస్‌ ప్యాకేజీని ప్రకటించడం. ఈ రెండు అంశాలప ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథంతో ఉన్నారని స్టాక్‌మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

<< Back to Archives